సుంకేసుల రిజర్వాయర్ కు శనివారం ఉదయం 80, 100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుంకేసుల జలాశయం నుంచి 18 గేట్లు ఎత్తి 77, 598 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు, అలాగే కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 026 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.