కారుమంచిల: ట్రాక్టర్ బోల్తాపడి బాలుడు మృతి

76చూసినవారు
కారుమంచిల: ట్రాక్టర్ బోల్తాపడి బాలుడు మృతి
నాలుగు రోజుల కిందటే కుమార్తెకు పెళ్లి చేసిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన దొరబాబు(12) అతని బాబాయి వెంట పొలం పనులకు వెళ్లి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లి రాధమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. బాలుడి తండ్రి కూడా ఐదేళ్ల కిందట రహదారి ప్రమాదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్