కోడుమూరు: అర్హులైన కౌలు రైతులందరికి రుణాలు

69చూసినవారు
కోడుమూరు: అర్హులైన కౌలు రైతులందరికి రుణాలు
పొలాలను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులందరికి రుణాలు ఇప్పిస్తామని ఎల్డీఎం రామచంద్రరావు సూచించారు. గురువారం కోడుమూరు, ఎర్రదొడ్డి, గోరంట్ల, ప్యాలకుర్తి గ్రామాల్లోరకౌలు రైతులకు ఏవో రవిప్రకాష్ ఆధ్వర్యంలో పంట రుణాల మంజూరుపై గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లీడ్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు హాజరయ్యారు. కౌలు రైతులకు పంట రుణాలిప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్