కర్నూలు జిల్లాలో జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో 515 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బుధవారం ప్రథమ సంవత్సరం పరీక్షలో 11, 064 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నా, 10, 656 మంది మాత్రమే హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలో 2074 మందిలో 1967 మంది పరీక్షలో పాల్గొన్నారు. ఈ పరీక్షలను ఆర్ఎస్ఐవో గురువయ్య శెట్టి, డీవీఈవో సురేష్ బాబు పర్యవేక్షించారు.