కోడుమూరు మండలంలో నులిపురుగుల నివారణ కోసం ఈనెల 10న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వైద్య సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఎంపీడీవో రాముడు సూచించారు. శుక్రవారం ఆయన కోడుమూరులో వైద్యాధికారి డాక్టర్ శ్రీమంతాదన్నతో కలిసి మాట్లాడారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలు రావడంతో వాటిని నిర్మూలించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.