గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్‌లో మంగళవారం ఎక్సైజ్ సీఐ మంజుల ఆధ్వర్యంలో నవోదయంలో భాగంగా కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్‌నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఏసీ హనుమంతరావు మాట్లాడుతూ మద్యపానం వల్ల నష్టాలు వివరించి, డి-అడ్డిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఈగల్ టీం, విశ్వభారతి ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.