గూడూరు మండలంలోని బూడిదపాడులో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కొట్టం దగ్ధమైంది. బోయ సుబ్బయ్య, బోయ రామానాయుడు అన్నదమ్ములు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. పొలం పనులకు వెళ్లిన వారిలేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు రేగి, ఇంట్లోని పత్తి, ధాన్యాలు, డబ్బులు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 5 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సహాయం అందించాలని ఎమ్మెల్యేను కోరారు.