కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం విషాద సంఘటన జరిగింది. వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. రైతు రవి తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రవి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.