కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోడుమూరుకు చెందిన షబ్బీర్ కారులో కర్నూలు వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. కాగా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. స్థానికులు ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.