మదాసికురువ, మాదారికురువ హక్కుల సాధన సమితి సభ్యులు శుక్రవారం గూడూరు మండల తహసిల్దార్ కే. రామాంజనేయులకు వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్డ్ కులజాబితాలో ఉన్న మదాసికురువ, మాదారికురువలను రెవెన్యూ అధికారులు కులమార్పిడి చేసి కురుబ, బీసీ-బీ కులంగా మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. కులమార్పిడి చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలను నిలిపివేయాలని కోరారు. సమితి నాయకులు మద్దిలేటి, మల్లికార్జున, దస్తగిరి పాల్గొన్నారు.