కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా బుధవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆంద్రయ్య అధ్యక్షతన మండల అధ్యక్షులు నాగరాజు నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సభ్యులు, మాదిగ ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం ఎస్సీలందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.