కోడుమూరు నియోజకవర్గంలోని గుడూరు రూరల్, అర్బన్ పరిధిలోని 4,079 మంది పెండింగ్ రేషన్ కార్డు సభ్యులు ఏప్రిల్ 30లోపు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని తహశీల్దార్ కే. రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎఫ్‌పి షాప్ డీలర్లు, సచివాలయాల ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. లేకపోతే మే నెల నుండి రేషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు.