కోడుమూరు: మండల నూతన ఎస్సైగా డి. ఎర్రిస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై ఏపీ శ్రీనివాసులు, చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కర్నూలు వీఆర్ నుంచి ఎర్రిస్వామి బదిలీపై కోడుమూరుకు వచ్చారు. ఈ ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రజలు గొడవలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.