ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు సంఖ్యను పెంచాలని కర్నూలు జిల్లా డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. మంగళవారం గూడూరు మండలంలో డ్రాప్ అవుట్ అయిన 48 మంది విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరారు. విద్యార్థులు నిజంగా చేరాయా లేదా అనే అంశంపై డీఈవో శామ్యూల్ పాల్ తనిఖీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంఈవో సునీలమ్మ, నాగరాజు,. హెచ్ఎం లు పాల్గొన్నారు.