కోడుమూరు: నైపుణ్యాలను పెంచుకుని ఉపాధి అవకాశాలు పొందాలి

73చూసినవారు
కోడుమూరు: నైపుణ్యాలను పెంచుకుని ఉపాధి అవకాశాలు పొందాలి
యువత నైపుణ్యాలను పెంపొందించుకోని ఉపాధి అవకాశాలను పొందాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సూచించారు. బుధవారం కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడులో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ భవనాన్ని ప్రారంభించారు. యువతకు విద్యతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యాలు ఎంతో అవసరం అన్నారు. యువత తమ జీవితాల్లో పురోభివృద్ధి సాధించి, తమ కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

సంబంధిత పోస్ట్