కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో సుంకులా పరమేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లాస్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు, ఎంపీటీసీ మద్దిలేటి హాజరై వృషభాలు బండలాగుడు పోటీలను ప్రారంభించారు. విజేతలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలు బహుమతులు అందజేయనున్నట్లు వారు తెలిపారు.