కర్నూలు జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం సర్వే శాఖలో గురువారం నలుగురు సిబ్బందికి బదిలీలు జరిగాయి. చిప్పగిరి సర్వేయర్ జి. చిన్ననారాయణ ఎమ్మిగనూరుకు, నందవరం సర్వేయర్ పి. అక్బర్ బాషా ఆలూరుకు, కోడుమూరు డిప్యూటీ సర్వేయర్ సునీల్ కుమార్ వెల్దుర్తికి, ఎస్. హేమంత్ వెల్దుర్తి నుంచి కర్నూలు రూరల్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.