ఎన్నికల హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కేటాయిస్తామని కర్నూలు కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కోడుమూరులో తొలి అడుగు కార్యక్రమంలో బీసీ, పెద్ద బోయగేరి ఇంటింటికీ వెళ్లి పథకాలను వివరించారు. తాగునీటి, రోడ్లు, మురికి కాల్వలు, వీధి లైట్ల సమస్యలను మహిళలు తెలిపారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. రామకృష్ణ రెడ్డి, గంగాధర్ ఉన్నారు.