కోడుమూరు: బర్రెల కాపరి హత్య కేసు.. ముగ్గురు మైనర్లు అరెస్ట్

85చూసినవారు
కోడుమూరు: బర్రెల కాపరి హత్య కేసు.. ముగ్గురు మైనర్లు అరెస్ట్
కర్నూలు రూరల్ మండలం భూపాలనగర్‌కు చెందిన బర్రెల కాపరి రఫిక్ హత్య కేసులో మంగళవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు అర్బన్ తాలూకా పోలీసులు తెలిపారు. మేకల కాపరులతో జరిగిన వాగ్వాదంలో రఫిక్, ఒకరి సోదరుడిని కించపరిచిన నేపథ్యంలో ఆవేశంతో మైనర్లు కర్రతో కొట్టి, కొడవలితో గొంతు కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్లను జువెనైల్ కోర్టులో హాజరు పరచారు.

సంబంధిత పోస్ట్