కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో రీసర్వే త్వరలో ప్రారంభమవుతున్నందున రైతులకు అవగాహన కోసం గురువారం ఉదయం 11 గంటలకు గ్రామంలో ర్యాలీ మరియు గ్రామసభ నిర్వహించబడుతుందని తహాసీల్దార్ వెంకటేష్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ, గోరంట్ల గ్రామ రైతులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.