కోడుమూరు: అమాయకులను అక్రమ కేసుల నుంచి తొలగించాలి

66చూసినవారు
కోడుమూరు: అమాయకులను అక్రమ కేసుల నుంచి తొలగించాలి
వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూర్ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. మంగళవారం కోడుమూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ తబ్రేజ్ ను కలిసి మాట్లాడారు. బ్రాహ్మణదొడ్డి గ్రామంలో జరిగిన హత్యాయత్నం, దాడులపై సీఐ తబ్రేజ్‌కు వివరాలు అందించారు. టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు దిగారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్