గూడూరు మండలంలోని గుడిపాడులో రూ.8 లక్షల కుడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లను శుక్రవారం జేసీ నవ్య తనిఖీ చేశారు. మండలంలోని మునగాల, మల్లాపురం, గుడిపాడు గ్రామాల్లో పర్యటించిన ఆమె ఆర్వో వాటర్ ప్లాంట్ వినియోగపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో తాగునీటి సమస్య తీరిందని ప్రజలు చెప్పడంతో జేసీ డాక్టర్ బి. నవ్య సంతోషం వ్యక్తం చేశారు. తహాసీల్దార్ రామాంజనేయులు ఉన్నారు.