కోడుమూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బోయగెరిలో జరిగిన సంచార చికిత్స శిబిరాన్ని గురువారం జిల్లా నోడల్ అధికారి డా. రఘు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ లక్షణాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించారు. 18 ఏళ్లు పైబడినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డా. శ్రీమంత్ మాదన్న, నరసప్ప, కమాల్ సాహెబ్, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.