కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏప్రిల్ 16న సాయంత్రం 5 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి - వారి జీవిత విశేషాలు అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నట్లు మంగళవారం త్రిమాన్ కమిటీ కన్వీనర్ ఎం. ప్రేమ్ కుమార్ అన్నారు. కర్నూలులో వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. కర్నూలు, పాణ్యం, కోడుమూరు అసెంబ్లీ పరిధిలోని రాష్ట్ర, జిల్లా నాయకులు కార్యకర్తలు రావాలన్నారు.