డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, వారి కుమారుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మంగళవారం కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సైబర్ క్రైమ్ లో కేసు నమోదు కావడంతో విచారణలో భాగంగా గూడూరు పట్టణంలోని పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్ ను అనే ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గుంటూరు తరలించినట్లు తెలిసింది.