కోడుమూరు: కార్మిక చట్టాలు రద్దు చేయాలని నిరసన

62చూసినవారు
కోడుమూరు: కార్మిక చట్టాలు రద్దు చేయాలని నిరసన
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలని, కొత్త లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టిన విధానానికి నిరసనగా బుధవారం కోడుమూరులో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ, రాజు, సిపిఎం మాజీ మండల కార్యదర్శి గపూర్మియా మాట్లాడారు. దేశంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బిజెపి ప్రభుత్వం కార్మికుల కడుపు కొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్