వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు వైసీపీ మండల అధ్యక్షుడిగా బోయ రమేష్ నాయుడు నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శనివారం రమేష్ నాయుడు మాట్లాడారు. కోడుమూరులో వైసీపీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.