కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం మామిదలపాడు గ్రామంలోని గోదాగోకులంలో సోమవారం శ్రీమద్రామాయణ మహాయజ్ఞంలో ప్రవచన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరైయ్యారు. త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ రామాయణ వైశిష్యాన్ని వివరిస్తూ, రామాయణం జీవితాల్లో మానవీయ విలువలను ఎలా పెంపొందించాలో చెప్పారు.