కోడుమూరు: వైభవంగా శ్రీసుంకుల పరమేశ్వరి దేవి రథోత్సవం

80చూసినవారు
కోడుమూరు: వైభవంగా శ్రీసుంకుల పరమేశ్వరి దేవి రథోత్సవం
గూడూరు మండలంలోని కె. నాగలాపురం గ్రామ దేవత శ్రీసుంకుల పరమేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం కె. నాగలాపురంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బీవీ నరసయ్య, ఆలయ సిబ్బంది కేశవ్, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మహా రథోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్