కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు జలకళ సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహం కోనసాగుతోంది. శనివారం ఎగువ నుంచి 50, 064 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ఆధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో జలాశయం నుంచి 12 గేట్లు ద్వారా 50, 064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1. 20 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 0. 84 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.