గూడూరు మండలంలోని కె. నాగలాపురం గ్రామంలో వెలసిన సుంకులాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం టెంకాయలు, పూలు, నిమ్మకాయల వేలం పాట జరిగింది. టెంకాయల వేలాన్ని టి. రంగస్వామి రూ. 14, 50, 000కి గెలుచుకున్నారు. పూలు, నిమ్మకాయల వేలాన్ని ఆర్. సుదర్శన్ రెడ్డి రూ. 2, 85, 000కి అందుకున్నట్లు ఆలయ ఈవో బీవీ నరసయ్య వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు కేశవ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.