కోడుమూరు: అప్పులభారంతో కౌలు రైతు ఆత్మహత్య

56చూసినవారు
కోడుమూరు: అప్పులభారంతో కౌలు రైతు ఆత్మహత్య
గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమటకు చెందిన కౌలు రైతు లక్ష్మన్న పంటలు పండక అప్పుల్లో కూరుకుపోయి గూడూరు-రేమట రహదారిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఎస్సై తిమ్మయ్య వివరాల ప్రకారం మూడేళ్ల నుంచి వేసిన పంటలు సరిగ్గా పంటక పోవడంతో దాదాపు రూ. 6. 50 లక్షలు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక ఈనెల 10న ఆత్మహత్యయత్నం చేసి కర్నూలు ఆసుపత్రిలో చికిత్సలో కోలుకోలేక మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్