కోడుమూరు పట్టణంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సీపీఎం సీనియర్ నాయకుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు మద్దూరు రామచంద్రుడు మంగళవారం కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. మద్దూరు రామచంద్రుడి అంత్యక్రియలు బుధవారం ఉదయం 10 గంటలకు కోడుమూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.