కర్నూలు: విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సీపీఐ ధర్నా

2చూసినవారు
కర్నూలు: విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సీపీఐ ధర్నా
విద్యుత్ ఛార్జీలు తగ్గించి, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని శనివారం కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నగర సహాయ కార్యదర్శి సి. మహేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ చార్జీలు తగ్గించి, నివాస గృహాలకు ఏర్పాటు చేస్తున్న ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, అదానితో చేసిన సోలార్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్