కర్నూలు: సీఎం చంద్రబాబు పర్యటనతో ట్రాఫిక్ మళ్లింపు

53చూసినవారు
కర్నూలు: సీఎం చంద్రబాబు పర్యటనతో ట్రాఫిక్ మళ్లింపు
కర్నూలు నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి వస్తుందని శుక్రవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, డోన్, అనంతపురం నుండి వచ్చే వాహనాలు గార్గేయపురం, సఫా కాలేజీ, గుత్తి పెట్రోల్ బంకు, బళ్లారి చౌరస్తా, రింగ్ రోడ్డు మార్గంగా ప్రయాణించాలి. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్