సి. బెళగల్ మండలం ముడుమాల గ్రామంలో పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం బార్కె నారాయణ కుమారులు రాముడు, రాజేష్‌లు గత కొంతకాలంగా భూమి విషయంలో తగాదాలు పడుతున్నారు. మరోసారి తలెత్తిన గొడవలో అన్న రాజేష్, తమ్ముడు రాముడి చెవిని కొరికాడు. దీంతో చెవి పూర్తిగా తెగిపోయింది. రాముడు ఫిర్యాదు మేరకు రాజేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పరమేష్ నాయక్ తెలిపారు.