కర్నూలులో జాతీయ లోక్‌ అదాలత్ ప్రారంభం

178చూసినవారు
కర్నూలులో జాతీయ లోక్‌ అదాలత్ ప్రారంభం
కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది శనివారం స్థానిక లోక్‌ అదాలత్‌ భవనంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే ధ్యేయంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భూసేకరణ కేసులలో నష్టపరిహారం చెక్కులు అందజేయడంతో పాటు, 16 బెంచ్‌లను వివిధ న్యాయాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి తెలిపారు.