ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి

78చూసినవారు
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ఈనెల 1వతేదీ ఉదయం 6 గంటల నుంచే గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేయాలని కోడుమూరు ఎంపీడీవో దివ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 9, 106 మంది పింఛనుదారులుండగా, రూ. 6, 21, 96, 500 మంజూరయ్యాయని చెప్పారు. సోమవారం సాయంత్రంలోగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్