పత్తిపంట ప్రధాన శత్రువు గులాబీ రంగు పురుగు అని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఆత్మ డీపీడీ శ్రీలత సూచించారు. బుధవారం కోడుమూరులో పత్తి పంట సాగు చేసిన పొలంలో రైతులకు ఏవో రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఆత్మ శాస్త్రవేత్తల బృందం గులాబీ పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించి, మాట్లాడారు. ఏడీఏలు గిరీష్, వెంకటేశ్వర్లు కర్నూలు ఏడీఏ దస్తగిరి రెడ్డి, ఏఓలు శశిధర్ రెడ్డి, మధుమతి పాల్గొన్నారు.