ఉపాధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

54చూసినవారు
ఉపాధి హామీ పథకం పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కోడుమూరులో జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీ చేశారు. కూలీల హాజరు, మస్టర్లు, పనుల వివరాలను పరిశీలించి, మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం పనులు చేస్తే రోజువారి వేతనం రూ. 300 వస్తుందని తెలిపారు. కూలీలంతా పనివేళలు పాటించడంతో పాటు పనుల్లో నాణ్యత ఉండేలా చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్