కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో గుంతలు పడి, కల్వర్టులు కొట్టుకుపోయిన రైతుల పొలాల దారులను తక్షణమే మరమ్మతు చేయాలని ఏపి రైతు సంఘం నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ రైతులతో కలిసి కలెక్టరేట్‌లోని ప్రజా పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు. వర్షాలతో రోడ్లు దెబ్బతిని, ప్రమాదాలకు గురవుతున్నామని, మరమ్మతులు చేపట్టాలని కోరారు.