గుడిపాడులో రూ. 8 లక్షల కుడా నిధులతో ఆర్వో ప్లాంట్ ప్రారంభం

63చూసినవారు
గుడిపాడులో రూ. 8 లక్షల కుడా నిధులతో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం కుడా అభివృద్ధి నిధులు రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను డీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్థన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగంలో భాగంగా నిర్మించిన ఈ ప్లాంట్ తో ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు. గ్రామ పెద్దలు, టీడీపీ నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్