గురుపౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం కోడుమూరు, గూడూరు, సి. బెళగల్ మండలాల్లో ప్రజలు సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. కోడుమూరులోని కోటవీధి, ప్యాలకుర్తి, పులకుర్తి గ్రామాల్లో వెలసిన సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో పోటేత్తారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాయీబ్రాహ్మణ సేవా సమితి సభ్యులు సాయిబాబా చిత్రపటాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.