కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం గూడూరు మండలం పెంచికలపాడులో కురుబ వెంకటరాముడు, జె. సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాలతో ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి, ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు.