రామచంద్రాపురంలో రెండు డయేరియా కేసులు

81చూసినవారు
రామచంద్రాపురంలో రెండు డయేరియా కేసులు
కోడుమూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో రెండు డయేరియా కేసులు నమోదయ్యాయి. డీఎంఅండ్ హెచ్వో ప్రవీణ్ కుమార్ శనివారం గ్రామాన్ని సందర్శించి డయేరియా బారిన పడిన అక్కమ్మ, మధు ఇండ్లకు వెళ్లి వాళ్ల పరిస్థితిని పరిశీలించారు. బాధితులను కోడుమూరు సీహెచ్సీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్