మార్కాపురం వద్ద రెండు వరుస రోడ్డు ప్రమాదాలు

83చూసినవారు
మార్కాపురం వద్ద రెండు వరుస రోడ్డు ప్రమాదాలు
గూడూరు మండలం కె. నాగులాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కాపురం స్టేజి దగ్గర రెండు వరుస ప్రమాదాలు జరిగాయి. శుక్రవారం ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు - బోలొరొ వాహనం ఢీ కొనగా, ఈ సంఘటన జరిగిన కొద్ది దూరంలో కారు - మోటర్ బైక్ ఢీ కొన్నాయి. అయితే ప్రయాణీకులు వాహనదారులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి స్వల్పగాయాలు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్