సి. బెళగల్ మండల నూతన తహసీల్దార్ వెంకటలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. కర్నూల్ అర్బన్ తహసీల్దారుగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. మండలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.