కోడుమూరు మండల కేంద్రంలో షణ్ముఖ ట్రేడర్స్, మన గ్రోమోర్ సెంటర్ ఎరువుల దుకాణాలను ఏవో రవిప్రకాష్ బుధవారం తనిఖీ చేశారు. ఐదు రకాల పత్తి విత్తన నమూనాలు సేకరించి నాణ్యత పరీక్షకు అమరావతి ల్యాబ్‌కు పంపించారు. రైతులు బిల్లు తీసుకొని భద్రపరచుకోవాలని, మొలక శాతం పరీక్షించిన విత్తనాలే అమ్మాలని ఏవో సూచించారు. అధిక ధరలకు, నాణ్యత లేని విత్తనాలు విక్రయించరాదని హెచ్చరించారు.