చౌక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పేదలకు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్నాథం డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నగర సహాయ కార్యదర్శి మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జగన్నాథం హాజరై మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.