కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలో 46. 5 మి. మీ వర్షపాతం నమోదైంది. వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వర్షపాతం కారణంగా ఆనంద్ సినీ కాంప్లెక్స్, కేసీ కెనాల్, రైల్వే బ్రిడ్జి కింద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు బైపాస్ రహదారికి మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.